కశ్మీర్ అంశంపై నేడు కీలక ప్రసంగం చేయనున్న ఇమ్రాన్ ఖాన్

  • పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ఇమ్రాన్
  • సాయంత్రం 5.30 గంటలకు ప్రసంగం
  • ఏం చెబుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు
కశ్మీర్ అంశంపై ఈ సాయంత్రం 5.30 గంటలకు పాక్ ప్రజలను ఉద్దేశించి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన పత్యేక కార్యదర్శి ఫిర్దౌస్ ఆషిక్ ఆవాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భారత్ ను ఎండగట్టేందుకు పాక్ చేయని ప్రయత్నం అంటూ లేదు. తన మిత్ర దేశం చైనా సహకారంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సైతం ఈ అంశాన్ని లేవనెత్తింది. అయితే, ఇతర దేశాల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడంతో డీలా పడిపోయింది. ఈ నేపథ్యంలో, పాక్ జాతిని ఉద్దేశించి ఇమ్రాన్ ప్రసంగించబోతుండటం గమనార్హం. ఇమ్రాన్ ఏం చెబుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Go Back to Shorts
Imran Khan
Pakistan
Kashmir

More Telugu News